శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి సోమవారం రాత్రి 9:58 గంటలకు పీఎస్‌ఎల్వీసీ- 60 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం రాత్రి 8:58 గంటల నుంచి నిర్విగ్నంగా కౌంట్ డౌన్ కొనసాగుతోంది. పీఎస్‌ఎల్వీసీ- 60 రాకెట్ బరువు 229 టన్నులు, ఎత్తు 44.5 కిలోలు. 440 కిలోల బరువుండే ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలతో పాటు, 24 బుల్లి ఉపగ్రహాలని నింగిలోకి పీఎస్‌ఎల్వీసీ - 60 రాకెట్ చేర్చనుంది. ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలు రెండేళ్ల పాటు సేవలు అందించనున్నాయి. డాకింగ్ సంక్లిష్ట సాంకేతిక పరిజ్ఞానంతో రోధసీలో ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలని అనుసంధానం చేసేలా డిజైన్ చేశారు శాస్త్రవేత్తలు.
అనుసంధానం అనతరం విడిపోయి భూపరిశీలన, సహజవనరుల పర్యవేక్షణ, పచ్చదనం, రోధసీలో రేడియో ధార్మికతపై అధ్యయనం చేయనున్నాయి. అలాగే మానవ సహిత ప్రయోగాలకు డేటాను ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలు అందివ్వనున్నాయి. ఈ రాకెట్ ప్రయోగంతో అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి తొలి అడుగు వేయనుంది ఇస్రో. శాస్త్ర సాంకేతిక రంగంలో అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ చేరనుంది. ఇప్పటికే ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ షార్‌కు చేరుకున్నారు. పీఎస్‌ఎల్‌వీసీ - 60 రాకెట్ ప్రయోగంతో ఇస్రో వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.