గత నెల3వ తేదీన చుండూరు పోలీస్ స్టేషన్లో రూ. 74 లక్షల సైబర్ మోసం కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ఐటీ కోర్ సిబ్బంది విచారించి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన నలుగురు ముద్దాయిలను గురువారం అరెస్టు చేశారు. ఎస్పీ తుషార్ డూడి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నగదు18 రాష్ట్రాల్లోని 39 జిల్లాల్లో 49 పోలీస్ స్టేషన్లో పరిధిలోనీ బ్యాంకుల ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ అయిందని వివరించారు.