జనవరి 14 నుంచి 45 రోజుల పాటు ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా జరగనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడకి వెళ్లేవారి కోసం అదనంగా మరో 26 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఏపీలోని గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ టౌన్, తెలంగాణలోని మౌలాలి జంక్షన్, వికారాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు వెళ్లనున్నాయి. కుంభమేళాలో 45 కోట్ల మంది పాల్గొంటారని అంచనా.