గుంటూరు నగరంలోని 20వ డివిజన్ సంపత్ నగర్, 2వ లైన్ పార్క్ బజారు రోడ్డు, శృంగేరి శారద పరమేశ్వరి టెంపుల్ రోడ్డు, అయ్యప్ప స్వామి గుడి ప్రాంతాలలో గురువారం మేయర్ మనోహర్ పర్యటించారు. ఆయా ప్రాంతాలలో డ్రైన్లు, కల్వర్టులు నిర్మించుటకు ప్రతిపాదనలు సిద్ధం చేసి, త్వరతగతిన వాటిని నిర్మించుటకు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.