సీఎం చంద్రబాబుపై మరోసారి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు.. పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలోని "ఆడవారి మాటలకూ అర్థాలే వేరులే"
అనే పాటను కాస్త మార్చేసి.. "చంద్రబాబు మాటలకు అర్థాలే వేరులే" అంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేది ఒకటి అయితే చేసేది మరొకటి అని ఎద్దేవా చేశారు.