‘నా జీవితంలో నిలబడే ధైర్యాన్నిచ్చింది పుస్తకాలే’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. పుస్తక మహోత్సవ కార్యక్రమంలో పవన్ మాట్లాడారు. ‘‘మా తల్లిదండ్రుల కారణంగానే పుస్తక పఠనం అలవాటైంది.
రూ.కోటి ఇవ్వడానికి ఆలోచించను గానీ పుస్తకాన్ని ఇచ్చేందుకు ఆలోచిస్తా. కొందరు పుస్తకాలు అడిగితే కొనిస్తా. కానీ నా వద్ద ఉన్నవి ఇవ్వను. పుస్తకపఠనం లేకపోతే జీవితంలో ఏమయ్యేవాడినో అనిపిస్తుంది’’ అని అన్నారు.