పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. అల్లు అర్జున్ అంశంను గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చారన్నారు. సారీ చెప్పడానికి పలు విధానాలు ఉంటాయని, ఘటన జరిగిన రెండో రోజే వెళ్లి మాట్లాడి ఉంటే ఇంత జరిగేది కాదన్నారు.
తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమతో గౌరవం, మర్యాదతో వ్యవహరించిందని.. సినిమా విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రోత్సాహం ఇచ్చారని పవన్ ప్రశంసించారు. ఈ అంశంపై పవన్ కళ్యాణ్ తీరును వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తప్పుపట్టారు. సంఘటన జరిగిన 27 రోజుల తరువాత నోరు మెదిపి మీ నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నందుకు సంతోషం అంటూ అంబటి రాంబాబు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.