ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య నుంచి ఆంగ్ల మాధ్యమ అమలుపై ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు మేథావులు చేసిన వ్యతిరేక వ్యాఖ్యలు వారి అహంకార మనస్తత్వాన్ని చాటుతున్నాయని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు ఆక్షేపించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్ధులు ప్రపంచ స్థాయి అవకాశాలను అందుకోవాలంటే ఆంగ్లంలో నిష్ణాతులు కావాలని, గత సీఎం వైయస్ జగన్ ముందుచూపుతో ఆ నిర్ణయాన్ని అమలు చేశారని ఆయన వెల్లడించారు. అయితే దురహంకారంతో వ్యవహరిస్తున్న కొందరు మేధావులు ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదిక సాక్షిగా, గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియమ్‌లో బోధనపై వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు బట్టడం ఏ మాత్రం సరికాదని జూపూడి తేల్చి చెప్పారు.