వైసీపీ ఎంపీపై మంత్రి సుభాష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఐదేళ్లలో రామచంద్రాపురంలో అంతులేని అవనీతి జరిగిందని ఆరోపించారు. దీనిపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు మంత్రి. కౌలు రైతుల పేర్లతో క్రాప్ ఇన్స్యూరెన్స్ కూడా మింగేశారని వైసీపీ నేతలపై మండిపడ్డారు. మాజీ మంత్రి వేణు, బోస్ వాటాలు పంచుకున్నారా అని నిలదీశారు. ఏరియా ఆస్పత్రులు, ద్రాక్షరామ ఆలయంలోనూ అవినీతి జరిగిందన్నారు. ఆరు నెలల పాలనలో అభివృద్ధి, గత ఐదేళ్ల వైసీపీ అవినీతిపై డిబేట్‌కు రావాలని ఎంపీ బోస్‌కు మంత్రి వాసంశెట్టి సుభాష్ సవాల్ విసిరడం చర్చనీయాంశంగా మారింది.