డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్‌డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ దిల్ రాజు భేటీ అయ్యారు. సోమవారం ఉదయం మంగళగిరి జనసేన కార్యాలయానికి వచ్చిన దిల్ రాజు.. పవన్‌తో సమావేశయ్యారు. హీరో రామ్ చరణ్ నటించిన ‘‘గేమ్ ఛేంజర్’’ సినిమా ఫంక్షన్‌లో ఏపీలో చేయాలని నిర్ణయించారు. దీంతో జనవరి 4న రాజమండ్రిలో నిర్వహించే గేమ ఛేంజర్ ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవ్వాలని పవన్‌ను దిల్ రాజు ఆహ్వానించారు. అలాగే సినిమా పరిశ్రమ అభివృద్ధిపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగింది.
అయితే ప్రీరిలీజ్ వేడుకకు సంబంధించి పవన్ కళ్యాణ్ నిర్ణయం తరువాతనే దిల్ రాజు వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ‘‘ముందు మార్పు సినిమా ఇండస్ట్రీ లో రావాలి. ముందు వారు కూర్చొని మాట్లాడాలి. విజయనగరం, అటవీ ప్రాంతం, పాపి కొండలు వంటి స్టన్నింగ్ లోకేషన్‌లు ఉన్నాయి’’ అని పవన్ అనగా.. ఏపీలో లోకేషన్‌లలో సదుపాయాలు కల్పించాలని దిల్ రాజు కోరారు. ‘‘క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉండాలి. స్టోరీ టెల్లింగ్ స్కూల్స్ రావాలి. నేను రోడ్డు మీదకు వెళ్తే అన్న మాకు పని ఇప్పించండి అంటున్నారు యువత. యువతలో క్రమశిక్షణ తీసుకురావాలి’’ పవన్ సూచించారు.