కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని వైయస్ఆర్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. ఫీజులు చెల్లించకపోతే విద్యార్థుల చదువులు ఎలా ముందుకు సాగుతాయని ఆయన ప్రశ్నించారు.