కూటమి ప్రభుత్వంలో ఎస్సీలకు రక్షణ లేకుండా పోయిందని వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు. కేవలం కూటమి ప్రభుత్వానికి ఓటు వేయలేదన్న కారణంతో దాడులు, వేధింపులకు గురి చేయడం సిగ్గు చేటు అన్నారు.
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్ది మండలం బొమ్మిరెడ్డిపల్లెలో దళితులను గ్రామ బహిష్కరణ చేయడం, ఆస్తుల విధ్వంసంపై వైయస్ఆర్‌సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో బాధితులను మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్ బాబు, కంగాటి శ్రీదేవి, కాటసాని రామ్‌భూపాల్ రెడ్డి, కోడుమూరు వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ పరామర్శించారు. అనంతరం కర్నూలు ఎస్‌పీని కలిసి ఫిర్యాదు చేశారు.