పదోతరగతి ఎస్‌ఏ(సమ్మేటివ్ అసె్‌సమెంట్) 1 పరీక్షల్లో గణితం ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. లీక్‌కు కారకులైన అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండల విద్యాశాఖాధికారితోపాటు ఉపాధ్యాయుడిని సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వీరిని విజయవాడ కోర్టులో సోమవారం హాజరుపర్చగా న్యాయాధికారి రిమాండ్ విధించారు. ఈనెల 16న జరగాల్సిన గణితం పరీక్ష ప్రశ్నాపత్రం అంతకుముందే లీకైన విషయం తెలిసిందే. దీనిపై ఏపీఎ్‌ససీఈఆర్టీ పరిపాలనాధికారి ఎం.అరుణ్‌కుమార్ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసును దర్యాప్తు చేసిన సైబర్‌క్రైం పోలీసులు.. రామచంద్రాపురానికి చెందిన సుబ్బారావు ఆ మండలంలోని జడ్పీ హైస్కూల్‌లో సోషల్ టీచర్‌గా గుర్తించారు. ప్రశ్నపత్రాలను ఏరోజుకారోజు ఎమ్మార్సీకి వెళ్లి తీసుకువస్తారు. ఈ క్రమంలో ఆయన 14న ఎస్‌ఏ1 ప్రశ్నాపత్రాలు తీసుకురావడానికి ఎంఈవో శ్రీనివాసరావుతో కలసి ఎమ్మార్సీకి వెళ్లారు. ఆరోజు జరగాల్సిన ప్రశ్నపత్రాలను తీసుకున్నారు. ఇదే సమయంలో రెండు రోజుల తర్వాత జరిగే గణితం ప్రశ్నపత్రాల కట్టలో ఒక దానిని కూడా సుబ్బారావు తీసుకున్నారు. గణితం ప్రశ్నపత్రాన్ని ఓ విద్యార్థినికి ఇచ్చారు. ఆ బాలిక దానిని టెలిగ్రామ్ చానల్‌లో అప్‌లోడ్ చేసింది. ఆ వెంటనే ఓ యూట్యూబ్ చానల్‌లో ప్రత్యక్షమైంది. ఆ టెలిగ్రాం చానల్ రామచంద్రపురం విద్యార్థినిదిగా గుర్తించారు.