తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలపై తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. తెలుగుజాతి సత్సంబంధాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ లేఖలో వెల్లడించారు. సోమవారం నుంచి గురువారం వరకు ఏదైనా రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం (రూ. 500 టికెట్), ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 300 టికెట్) కోసం రెండు లేఖలు చొప్పున కేటాయిస్తామని తెలిపారు.
శ్రీవారి దర్శనానికి తమ ప్రజాప్రతినిధుల లేఖలు కూడా అనుమతించాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లేఖ రాసిన నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నారు. కాగా, అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అమరావతి సచివాలయంలో సోమవారం భేటీ అయ్యారు. తిరుమల దర్శనంపై తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు సంబంధించి చర్చించారు.