ఇటీవల మృతిచెందిన సుప్రీంకోర్టు, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎం.జగన్నాథరావుకు హైకోర్టు సోమవారం ఘన నివాళి అర్పించింది. మొదటి కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం జస్టిస్ జగన్నాథరావు అందించిన న్యాయసేవలను గుర్తు చేసుకున్నారు.
పలు కీలక తీర్పులు ఇచ్చారన్నారు. జస్టిస్ జగన్నాథరావు ఆత్మకు శాంతి చేకూరాలని కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ జగన్నాథరావు కుమారుడు జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పసల పొన్నారావు, ప్రభుత్వ న్యాయవాదులు, రిజిస్ట్రార్‌లు, కోర్టు ఉద్యోగులు పాల్గొన్నారు.