పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసులో పుణె కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 2023 మార్చిలో లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వి.డి సావర్కర్‌ను ఉద్దేశించి రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో రాహుల్‌పై సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ పుణెలోని ఓ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేసిన విషయం తెలిసిందే.