మడకశిరలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో మంగళవారం మడకశిర శాసనసభ్యులు ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఖాయమని, వైసిపి చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. జగన్ ఐదేళ్ల పరిపాలనలో విశాఖ ఉక్కు ఒక రూపాయి తేలేదని, అలాంటి చేతగాని వారు ఈరోజు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.