విశాఖ కేంద్రంగా వాల్తేర్ డివిజన్ తో కూడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించడాన్ని సీపీఎం విశాఖ జిల్లా కమిటీ స్వాగతిస్తున్నట్లు ఆ పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి జగ్గు నాయుడు తెలిపారు. శుక్రవారం జగదాంబ వద్ద గల పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నం కేంద్రంగా వాల్తేర్ డివిజన్ తో కూడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కు కేంద్రం చేసిన నిర్ణయం ప్రజా విజయమన్నారు.
![]() |
![]() |