ప్రముఖ తమిళ నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం నేతలు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో సమావేశమయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉంది. ఈ సమయంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.విజయ్ సారథ్యంలోని పార్టీ నేతలతో ప్రశాంత్ కిశోర్ మంతనాల నేపథ్యంలో, వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రత్యేక సలహాదారుడుగా ఉండనున్నారని వార్తలు వస్తున్నాయి. తమిళనాడులో విజయ్ పార్టీకి 15 నుండి 20 శాతం ఓటు షేర్ ఉంటుందని ప్రశాంత్ కిశోర్ అంచనా వేసినట్లుగా సమాచారం. దీనిని మరింత పెంచేందుకు ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు రచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.విజయ్ పార్టీ నేతలతో ప్రశాంత్ కిశోర్ భేటీపై అధికార డీఎంకే నేత, మంత్రి శేఖర్ బాబు స్పందించారు. ఎన్నికల్లో ఓట్లు అడిగే ప్రతి పార్టీ తమకే వంద శాతం ఓట్లు వస్తాయని ప్రకటించుకుంటుందని ఆయన అన్నారు. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే మరోసారి గెలిచి స్టాలిన్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఒక రాజకీయ పార్టీకి ప్రశాంత్ కిశోర్ సేవలు అందిస్తే తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని డీఎంకే నేత కనిమొళి అన్నారు.
![]() |
![]() |