అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత చదువులు చదవాలని అనేక మంది కలలు కంటారు. అందుకోసం ప్రతీ ఏటా అనేక మంది విద్యార్థులు.. ఎఫ్-1 వీసాల కోసం దరఖాస్తులు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారందరికీ అమెరికా సర్కారు గట్టి షాక్ ఇచ్చింది. ముఖ్యంగా స్టూడెంట్ వీసాల కోసం దరఖాస్తులు చేసుకున్న దాదాపు 41 శాతం మంది దరఖాస్తులను తిరస్కరించింది. గత పదేళ్లలో ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు తిరస్కరణలు జరక్కపోగా.. 2023-24లోనే అధికంగా జరిగాయి. దశాబ్ద కాలంతో పోలిస్తే తిరస్కరణ దాదాపు రెట్టింపు అయినట్లు తెలుస్తోంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
భారతీయ విద్యార్థులకూ గట్టి షాక్..
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టకముందు నుంచే ఎఫ్-1 విద్యార్థి వీసా ఆమోదాల్లో విపరీతమైన క్షీణత ప్రారంభం అయింది డేటా సూచిస్తోంది. ముఖ్యంగా అమెరికా విదేశాంగ శాఖ గణనాల ప్రకారం.. 2018 ఆర్థిక సంవత్సరంలో భారతీయులకు ఆమోదించబడిన విద్యార్థి వీసాల సంఖ్య దాదాపు 42,000. అయితే 2024 నాటికి ఈ సంఖ్య 86 వేలకు పెరిగినప్పటికీ.. 2022, 2023తో పోలిస్తే చాలా తక్కువ. ముఖ్యంగా 2022 విద్యా సంవత్సరంలో 1.15 లక్షల విదార్థి వీసాలను అమెరికా ఆమోదించింది. అలాగే 2023లో 1.31 లక్షల ఎఫ్-1 వీసాలను అమెరికా ఆమోదించినట్లు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ డేటా తెలిపింది.
ముఖ్యంగా 2024 సంవత్సరం మొదటి 9 నెలల్లో భారతీయ విద్యార్థులకు ఎఫ్-1 వీసాలు 38 శాతం తగ్గినట్లు వెల్లడించింది. కరోనా తర్వాత భారతీయ విద్యార్థులకు వీసాలు ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారని చెప్పింది. కానీ గతేడాది పోలిస్తే ఈ ఏడాది కూడా దరఖాస్తుల తిరస్కరణ ఎక్కువగానే ఉన్నట్లు అర్థం అవుతోంది. ముఖ్యంగా 2024 అక్టోబర్ నెలలో 581, నవంబర్ లో 4,511, డిసెంబర్ లో 7,630 ఎఫ్-1 వీసా ధరఖాస్తులను ఆమోదించగా.. 2025 జనవరి నెలలో 1,167గా నమోదు అయ్యాయి.
మరోవైపు 2023-2024 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్-1 వీసాల కోసం మొత్తంగా 6.79 లక్షల దరఖాస్తులు రాగా.. ఇందులో 2.79 లక్షల దరఖాస్తులను అమెరికా తిరస్కరించింది. అంటే 41 శాతం మందికి స్టూడెంట్ వీసాలు ఇవ్వడానికి నిరాకరించింది. అంతకుముందు ఏడాది అంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6.99 లక్షల దరఖాస్తులు రాగా.. 2.53 (36 శాతం) నిరాకరణకు గురయ్యాయి. కానీ 2.13-14 ఆర్థిక సంవత్సరంలో 7.69 లక్షల మంది ఎఫ్-1 వీసాల కోసం దరఖాస్తులు చేసుకోగా.. 1.73 లక్షల (23 శాతం) మాత్రమే తిరస్కరణకు గురయ్యాయి. వీటన్నిటినీ పోలిస్తే గత పదేళ్లలో తిరస్కరణల సంఖ్య దాదాపు రెట్టింపు అయింది.
![]() |
![]() |