అమరావతి రాజధానిలో జరుగుతున్న పనుల్లో కూటమి సర్కార్ భారీ అవినీతికి తెర తీసిందని వైయస్‌ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తనకు అనుకూలమైన ఎనిమిది సంస్థలకే 59 ప్యాకేజీల కింద మొత్తం రూ.28,210 కోట్ల విలువైన పనులను కట్టబెట్టారని అన్నారు. వీటికి మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల కింద ఇచ్చే రూ.2821 కోట్ల నుంచే 8 శాతం కమిషన్లుగా దండుకుంటున్నారని మండిపడ్డారు. తన అవినీతికి అడ్డం వస్తాయనే ఉద్దేశంతోనే గత ప్రభుత్వంలో వైయస్ జగన్ గారు తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్, జ్యుడీషియల్ ప్రివ్యూ విధానాలను పూర్తిగా తొలగించారని అన్నారు.అయన మాట్లాడుతూ.... కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దోచుకోవడం, దాచుకోవడం అనే విధానాన్ని అనుసరిస్తోంది. ప్రజాధనంను పెద్ద ఎత్తున లూఠీ చేస్తోంది. గత వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పారదర్శక విధానాలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. తాజాగా రాజధాని అమరావతి పనుల్లో వేల కోట్ల రూపాయల దోపిడీకి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. తమకు అనుకూలమైన సంస్థలను ఎంపిక చేసుకుని, వాటికి అధిక రేట్లకు టెండర్లను కట్టబెట్టడం, వారికే మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల కింద పెద్ద ఎత్తున నిధులను విడుదల చేయడం, దాని నుంచి తిరిగి కమీషన్లను దండుకోవడంను ఒక వ్యవస్తీకృత విధానంలాగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఒకచేత్తో అడ్వాన్‌లను ఇవ్వడం, మరోచేత్తో వారి నుంచి కమీషన్లను అందుకోవడం కూటమి ప్రభుత్వ కొత్త పాలసీగా కనిపిస్తోంది అని అన్నారు.
![]() |
![]() |