ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు శనివారం పరామర్శించారు. పెనుగంచిప్రోలులో ఈ నెల 18 పసుపు - కుంకుమ సమర్పించే ప్రభ బండల కార్యక్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు కేసు నమోదు చేయించడంతో పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం బందర్ సబ్ జైలు నుంచి పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్‌కు ఇవాళ వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను తీసుకువస్తుండగా జగ్గయ్యపేట ఆసుపత్రి వద్ద వారిని తన్నీరు నాగేశ్వరరావు పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన వెంట న్యాయవాది పసుపులేటి శ్రీనివాసరావు, శివరాత్రి పృథ్వి రాజ్, పట్టణ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి గొట్టిపాళ్ళ సురేష్, తదితరులు ఉన్నారు.
![]() |
![]() |