ఈ నెల 30వ తేదీన తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో అర్చకులు,అధికారులు శుద్ధి కార్యక్రమాలు (కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం) నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి దర్శనాలను నిలిపివేశారు. శుద్ధి కార్యక్రమం ముగిసిన తరువాత ఉదయం 11 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నేపథ్యంలో వారపు సేవైన అష్టదళ పాద పద్మారాధన సేవను కూడా రద్దు చేశారు.కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ అధకారులు రద్దు చేశారు. 25వ తేదీన ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలు స్వీకరించబడవని అధికారులు తెలియజేశారు. 30న ఉగాది ఆస్థానం ఉంటుందని పేర్కొన్నారు.
![]() |
![]() |