ఛత్తీస్గఢ్ బీజాపుర్ అడవులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లాయి. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్లలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. బీజాపుర్ - దంతెవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న గంగలూరు పరిధి అండ్రి అడవుల్లో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నారనే సమాచారం వచ్చింది. దీంతో జిల్లాల నుంచి సంయుక్త బలగాలు ఉదయం 7గంటల నుంచి అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈక్రమంలో ఇరువర్గాల మధ్య భారీ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.
![]() |
![]() |