రాష్ట్ర ప్రజలకు ముఖ్య గమనిక. నేటి నుంచి 28వ తేదీ వరకు రాష్ట్రంలో రెండో విడత ఆధార్ నమోదు క్యాంపులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆరేళ్ల లోపు చిన్నారుల బర్త్ సర్టిఫికెట్ ఆధారంగా ఆధార్ నమోదు చేసుకోవచ్చు. ఈ మేరకు అధికారులు గ్రామ, వార్డు సచివాలయాలలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. కాగా, ఇప్పటివరకు ఆధార్ నమోదు చేసుకోని పిల్లల సంఖ్య 1,86,706 ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
![]() |
![]() |