ప్రయాణికులకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గుడ్ న్యూస్ చెప్పారు. టికెట్లు కౌంటర్‌లో కొన్న కూడా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకోవచ్చని తెలిపారు. గతంలో ఈ వెసులుబాటు ఉండేది కాదు. తాజాగా అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రైలు బయలుదేరడానికి ముందు IRCTC వెబ్‌సైట్ లేదా 139కు ఫోన్ చేసి టికెట్లను క్యాన్సిల్ చేసుకోవచ్చని వివరించారు. అయితే టికెట్ క్యాన్సిల్ డబ్బులు కౌంటర్‌లోనే అందజేస్తారని తెలిపారు.రైల్వే టికెట్ రద్దు చేసుకునే ప్రయాణికులు రైలు బయలుదేరే ముందు స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం ఉందా? అని బీజేపీ ఎంపీ మేధా విశ్రామ్ కులకర్ణి ప్రశ్నించారు. రైల్వే ప్యాసింజర్ (టికెట్ క్యాన్సిల్, రీఫండ్) రూల్స్ 2015లో నిర్దేశించిన సమయ పరిమితి ప్రకారం.. PRS కౌంటర్ (రైల్వే రిజర్వేషన్ సెంటర్) నుంచి తీసుకున్న వెయిట్‌లిస్ట్ టికెట్‌ను సరెండర్ చేస్తే.. రిజర్వేషన్ కౌంటర్‌లో టికెట్ రద్దు అవుతుందని వైష్ణవ్ రాజ్యసభలో ఈ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
“అయితే, సాధారణ పరిస్థితులలో రైల్వే ప్యాసింజర్ (టికెట్ క్యాన్సిల్, ఛార్జీల రీఫండ్) రూల్స్ 2015 ప్రకారం.. IRCTC వెబ్‌సైట్ లేదా 139 ద్వారా PRS కౌంటర్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకోవచ్చు. రిజర్వేషన్ కౌంటర్ల ఒరిజినల్ PRS కౌంటర్‌లో టికెట్‌ను సమర్పించడం ద్వారా రీఫండ్ మొత్తాన్ని పొందవచ్చు” అని ఆయన అన్నారు.
![]() |
![]() |