ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంపై ఎన్డీయే సర్కారు ఆసక్తి చూపిస్తోంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్నది ఈ విధానం ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే దీనిపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిషన్ కూడా ఏర్పాటైంది. కోవింద్ కమిషన్ నివేదికను కూడా సమర్పించింది. తాజాగా ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రాముఖ్యత-సవాళ్లు-ప్రభావం పేరిట కర్ణాటక చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బెంగళూరులో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. 1952లో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయని, అనంతరం 1967 వరకు దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగాయని వివరించారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ వచ్చాక పరిస్థితి మారిపోయిందని అన్నారు. తనకు నచ్చని రాష్ట్రాల ప్రభుత్వాలను ఇందిరాగాంధీ రద్దు చేయడంతో అసెంబ్లీ ఎన్నికల సమయాలు మారిపోయాయని వెంకయ్యనాయుడు తెలిపారు. గతంలో జమిలి ఎన్నికలు నిర్వహించింది కాంగ్రెస్ హయాంలోనే అని, మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడెందుకు జమిలి ఎన్నికలు వద్దంటుందో చెప్పాలని నిలదీశారు.
![]() |
![]() |