అన్నాడీఎంకే కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామిపై తమిళనాడు సీఎం స్టాలిన్ విమర్శలు గుప్పించారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన పళనిస్వామి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉంది. అమిత్ షా, పళనిస్వామి భేటీపై స్టాలిన్ విమర్శలు చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తున్న సమయంలో అసెంబ్లీలో పళనిస్వామి లేకపోవడాన్ని తప్పుబట్టారు. వక్ఫ్ బిల్లు ముస్లింల హక్కులను హరిస్తుందని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు పళనిస్వామి ఎందుకు హాజరు కాలేదో అందరికీ తెలుసని స్టాలిన్ చెప్పారు. తెల్లవారుజామున ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఎయిర్ పోర్టుకు వెళ్లి ఢిల్లీ విమానం ఎక్కారని తెలిపారు. స్కాముల్లో చిక్కుకున్న వ్యక్తి మాదిరి అమిత్ షాను కలవడానికి నాలుగు కార్లు మార్చారని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పిచ్చి చూపులు చూస్తూ కూర్చున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలుస్తుందని పళనిస్వామి చెబుతున్నారని... కానీ, వారు ప్రతిపక్షానికే పరిమితమవుతారని చెప్పారు.
![]() |
![]() |