కోల్‌కతా : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ్ల ప్రతి ఒక్కరూ తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అవుతున్నారని ఆ పార్టీ నేత డెరిక్ ఒబ్రీన్ అన్నారు. ఎన్నికల వేళ ఇది సహజమేనని ఆయన అభిప్రాయపడ్డారు. మమతా బెనర్జీతో సమావేశమవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రానున్న తరుణంలో డెరిక్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ మమతా బెనర్జీతో సమావేశమవుతున్నారని, ఆమె చెప్పేది వినడం, తమ అభిప్రాయాలు ఆమెతో పంచుకోవడం చేస్తున్నారని, ఇది సహజమేనని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa