పశ్చిమబెంగాల్ లో బీజేపీ రథయాత్రకు అనుమతి నిరాకరిస్తూ కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన బీజేపీకి చుక్కెదురైంది. ఈ పిటిషన్ పై విచారణ అవసరం లేదని పిటిషన్ ను కొట్టివేసింది. సాధారణ కేసుల్లాగానే దీన్ని కూడా పరిగణిస్తున్నామని చెప్పింది. కేసు వివరాల్లోకి వెళ్తే, పశ్చిమబెంగాల్ లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రథయాత్రను చేపట్టాలనుకున్నారు. శాంతిభద్రతల కారణంగా అనుమతిని ఇవ్వలేమని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీనిపై కలకత్తా కోర్టును బీజేపీ ఆశ్రయించింది. పిటిషన్ ను విచారించిన ఏకసభ్య ధర్మాసనం రథయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతరం ఈ తీర్పును డివిజన్ బెంచ్ పక్కన పెట్టేసింది. దీంతో, బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa