ఈ సారి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ గెలుపు వరించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన మంగళగిరిలో ముందంజలో దూసుకు వెళుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో 12 వేల పైచిలుకు ఓట్లతో ముందంజలో ఉన్నారు. లోకేశ్ దూకుడు ముందు వైసీపీ అభ్యర్థి ఎం.లావణ్య నిలబడలేకపోతున్నారు. రెండో రౌండ్ ముగిసే సరికి లావణ్యపై 12,121 ఓట్లతో లోకేశ్ లీడ్ లో కొనసాగుతున్నారు.
నగరిలో వెనుకబడ్డ రోజా
నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ మంత్రి రోజా ఫలితాల్లో వెనుకబడ్డారు. తొలి రౌండ్ ముగిసే సరికి రోజా సమీప ప్రత్యర్థి, టీడీపీ నేత యరపతినేని 1,311 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa