ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడపలోను సత్తా చూపుతున్న కూటమి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 04, 2024, 10:18 AM

ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ హవా కొనసాగిస్తోంది. వాస్తవానికి రాయలసీమ వైసీపీకి అడ్డా. ఇప్పుడు ఇక్కడంతా టీడీపీ హవా నడుస్తోంది. ముఖ్యంగా కడప జిల్లాలో టీడీపీ ముందంజలో ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కడప, మైదుకూరు, రాయచోటి, జమ్మలమడుగులో టీడీపీ ముందంజలో ఉంది. బద్వేలులో వైసిపీ అభ్యర్థి 1483 ఓట్లతో ముందంజలో ఉన్నారు. పులివెందులలో అంటే ఏపీ సీఎం జగన్ అడ్డాలో పెద్ద ఎత్తున ఆయన ఆధిక్యాన్ని ఏమీ చాటక పోవడం గమనార్హం. రెండు రౌండ్లు ముగిసే సమయానికి జగన్ రెడ్డి కేవలం 1888 ఓట్ల అధిక్యంలో ఉన్నారు. అలాగే ప్రొద్దుటూరులో వైసీపీ అభ్యర్థి 471 ఓట్ల అధిక్యంలో ఉన్నారు. కడపలో టీడీపీ అభ్యర్థి మాధవి రెడ్డి 3069 ఓట్ల అధిక్యంలో ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa