ఏలూరు జిల్లా శుక్రవారం నిర్వహించిన 31 రెవెన్యూ సదస్సుల్లో 1, 456 మంది పాల్గొని ఆయా సమస్యలపై 307 అర్జీలను అందజేశారని జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ. అందిన అర్జీలలో 77 అర్జీలను అప్పటికప్పుడే పరిష్కరించామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు జరిగిన సదస్సులకు 2, 729 అర్జీలు వచ్చాయని వాటిలో ఇప్పటికే 521 అర్జీలు పరిష్కరింపబడ్డాయన్నారు.