ఆదివారం ఉదయం కడప పోలీస్ పెరేడ్ గ్రౌండులో వేడుకగా కన్నుల పండుగగా ప్రారంభమైన 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్, జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, జేసి అదితి సింగ్, కడప ఆర్డీవో జాన్ ఇర్వీన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయం 9.00 గంటలకు జిల్లా కలెక్టర్ శ్రీధర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి రాష్ట్రీయ సెల్యూట్ చేశారు.