ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారు తమని తాము భారతీయులుగా భావించ‌రు

national |  Suryaa Desk  | Published : Thu, Sep 26, 2019, 06:32 PM

ప్రధాని నరేంద్ర మోదీని జాతిపిత అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలను గౌరవించని వారు తమని తాము భారతీయులుగా భావించరని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో ఉన్న వారు ఈ రోజు భారతీయులమని గర్విస్తున్నారు. మోదీ వ్యక్తిత్వం, ప్రతిష్ట వల్లే అది సాధ్యమైంది అని అన్నారు. భారత ప్రధానినుద్ధేశించి గతంలో అమెరికా అధ్యక్షుడెవరూ ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. దేశానికి జాతిపిత మాత్రమే ఉంటారని పేర్కొంటున్న కాంగ్రెస్‌.. ఈ వ్యాఖ్యలపై ట్రంప్‌ను అడగాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa