గుంటూరు: ఇంటి నుంచి అదృశ్యమైన బాలుడు చివరకు కాల్వలో శవమై తేలిన విషాద ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పిడుగురాళ్ల మండలం జానపాడుకి చెందిన మిద్దె సంతోష్‌సాయికిరణ్ (13) ఈ నెల 22న ఇంటి నుంచి బయటకు వచ్చాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆచూకీ కోసం అన్నిచోట్లా వెతికారు. ఫలితం లేకపోవడంతో బాలుడి తండ్రి వెంకట్రావు పిడుగురాళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తాజాగా ఆదివారం చేజర్ల వద్ద సాగర్ కుడి కాల్వలో ఓ బాలుడి మృతదేహం లభ్యమైంది. అది సంతోష్ సాయికిరణ్‌దిగా గుర్తించారు. అతను ప్రమాదవశాత్తూ కాల్వలో పడిపోయి ఉంటాడని భావిస్తున్నారు. సైకిల్‌పై వెళ్లిన తనయుడు చివరకు శవమై తేలడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa