ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి దారుణం

national |  Suryaa Desk  | Published : Mon, Jan 03, 2022, 04:32 PM

ఓ మహిళ తన ప్రియుడితో కలిసి అత్తమామలను దహనం చేసిన ఘటన పంజాబ్​ లో శనివారం రాత్రి జరిగింది. ఈ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. వివరాల్లోకి వెళితే.. పంజాబ్​ హోషియార్​పుర్ ​లోని తాండాకు చెందిన రిటైర్డ్​ ఆర్మీ అధికారి మంజీత్​ సింగ్, ఆయన భార్య వారి ఇంట్లోనే దహనం అయ్యారు. ఈ ఘటన జరిగినప్పుడు మంజీత్ సింగ్ కోడలు మణిదీప్ కౌర్ ఇంట్లోనే ఉంది. దీంతో మంజీత్​ సింగ్​ కుమారుడు రవీందర్​ సింగ్ ఆమెపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు ఆమెను తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టారు.


రవీందర్​ సింగ్ భార్య మణిదీప్​ కౌర్​ కు జస్మిత్ సింగ్​ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. వారి సంబంధానికి అత్తమామలే అడ్డుగా ఉన్నారని మణిదీప్ కౌర్ భావించింది. ప్లాన్ ప్రకారం తన ప్రియుడితో కలిసి శనివారం రాత్రి మంజీత్​ సింగ్, ఆయన భార్యను కత్తితో పొడిచి హత్యచేశారు. పోలీసులకు ఆధారాలు చిక్కకుండా మృతదేహాలకు నిప్పంటించి కాల్చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో రవీందర్​ సింగ్ ఇంట్లో లేడు. దుండగులే ఈ పని చేశారని పోలీసులను నమ్మించేందుకు ఇంట్లోని 19 తులాల బంగారం, రూ. 45వేలు నగదును మణిదీప్​ కౌర్ తన ప్రియుడు జస్మిత్​ సింగ్​కు ఇచ్చి పంపించింది. దర్యాప్తు అనంతరం మణిదీప్​ కౌర్​, జస్మిత్​సింగ్​లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఓ కత్తి, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa