ఏపీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లారు. నేటి సాయంత్రం 4 గంటల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్నారు. రేపు ఉదయం 9.30 గంటలకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ భేటీ కానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa