ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాకి చెందిన వెల్త్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ విభాగం కాంట్రాక్టు ప్రాతిపదికన 105 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు : 105 ఇందులో వెల్త్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ లో 58, అగ్రి బ్యాంకింగ్ విభాగంలో 47 పోస్టులు ఉన్నాయి.
1. వెల్త్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ - 58
పోస్టులు: హెడ్-వెల్త్ స్ట్రాటజిస్ట్, ఇన్వస్ట్ మెంట్ రిసెర్చ్ మేనేజర్, పోర్ట్ఫోలియో రిసెర్చ్ అనలిస్ట్, ప్రోడక్ట్ మేనేజర్, ట్రేడ్ రెగ్యులేషన్, గ్రూప్స్ సేల్స్ హెడ్, ప్రోడక్ట్ హెడ్, ప్రైవేట్ బ్యాంకర్.
అర్హత: ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. పని అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 22 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
2.అగ్రి బ్యాంకింగ్ విభాగం -4
పోస్టు: అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్లు
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో నాలుగేళ్ల డిగ్రీతో పాటు రెండేళ్ల పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత. పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 25 నుంచి 40 మధ్యలో ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100, ఇతరులకు రూ.600
దరఖాస్తులకు లాస్ట్ డేట్: జనవరి 27, 2022
వెబ్ సైట్: https://www.bankofbaroda.in/
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa