వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని వైష్ణవ ఆలాయలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే వైకుంఠ ద్వార దర్శనానికి బారులు తీరారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు. అందుకే ఈ పర్వదినాన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు మహా విష్ణువు గరుడ వాహనం అధిరోహించి మూడుకోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి..భక్తులకు దర్శనమిస్తాడని నమ్మకం. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే నేరుగా వైకుంఠానికి వెళ్తామని భక్తుల నమ్మకం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa