ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ లో మిస్ అయింది...ఇటలీలో దొరికింది

international |  Suryaa Desk  | Published : Sun, Feb 13, 2022, 03:00 PM

భారతదేశానికి చెందిన ఓ భౌద్ద విగ్రహం తప్పిపోయి చివరకు అది ఇటలీలో లభ్యమైంది. భారత దేశం నుంచి అక్రమంగా తరలించిన 1200 ఏళ్ల క్రితం నాటి బౌద్ధ విగ్రహం ఇప్పుడు బయటపడింది. ఇటలీలో దొరికిన ఈ విగ్రహాన్ని ఇప్పటికే అక్కడి భారతీయ అధికారులకు అందజేశారు. ఆ విగ్రహం బీహార్‌లోని దేవిస్థాన్ కందుల్పూర్ ఆలయంలో 1200 సంవత్సరాల పాటు ఉంది. రెండు దశాబ్దాల క్రితం దీనిని దొంగిలించి, ఇతర దేశాలకు తరలించినట్టు తెలుస్తోంది. ఇటలీలోని మిలాన్‌లోని ఇండియన్ క్యాన్సులేట్ చాలా ప్రత్యేకమైన ఈ అవలోకితేశ్వర పదమపాణి విగ్రహాన్ని రికవరీ చేసుకుంది. ఆ శిల్పాన్ని మిలన్‌లోని భారత కాన్సులేట్ జనరల్‌కు ఇటలీ కలెక్టర్ అందజేశారు. "రాతి విగ్రహం 8వ, 12వ శతాబ్దానికి చెందినది. అవలోకితేశ్వరుడు తన ఎడమ చేతిలో వికసించిన కమలాన్ని పట్టుకుని నిలబడి ఉన్నట్టు రూపొందించారు." అని ఇండియన్ క్యాన్సులేట్ వెల్లడించింది. కొద్ది రోజుల క్రితం ఫ్రాన్స్ ఆర్ట్ మార్కెట్లో ఉన్న ఈ శిల్పం ఇప్పుడు ఇటలీలోని మిలాన్‌కు చేరింది. ఇండియన్ ప్రైడ్ ప్రొజెక్ట్ అయిన ఈ విగ్రహాన్ని సింగపూర్ అండ్ ఆర్ట్ రికవరీ ఇంటర్నేషనల్ యథాస్థానానికి చేర్చడంలో సహకారం అందజేస్తోంది. ఈ బుద్ధ విగ్రహాన్ని త్వరలో దేశానికి తరలించనున్నారు. సంబంధిత అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa