ఏపీ రాజకీయాలలో కేసీఆర్ ఎంటి దేనికి అన్న ఆశ్చర్యంకలిగించవచ్చు. ఏపీలో ఇటీవల సినిమా టిక్కెట్ల ధర అంశంపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీలో కేసీఆర్ ఎంటి అని చెప్పవచ్చు. విజయవాడలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ఫ్లెక్సీ వెలిసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. 'భీమ్లా నాయక్' సినిమాకు తెలంగాణ ప్రభుత్వం ఐదు షోలు వేసుకోవడానికి అనుమతించిన సంగతి తెలిసిందే. అంతేకాదు సినిమా టికెట్ ధరలను కూడా టీఎస్ ప్రభుత్వం ఇటీవల పెంచింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ పై పవన్ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకున్నారు. మరోవైపు ఈ చిత్రానికి ఏపీలో పలు చోట్లు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే పవన్ ఫ్యాన్స్ కేసీఆర్ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్టు భావిస్తున్నారు. 'హ్యాట్సాఫ్ సీఎం సర్' అంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ఈ ఫ్లెక్సీపై తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, దివంగత వంగవీటి మోహన రంగా, వంగవీటి రాధా, జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఫొటోలను కూడా ఉంచారు. నగరంలోని కృష్ణలంకలో ఫైర్ స్టేషన్ సమీపంలో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ ఏర్పాటు నగరంలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు హిట్ టాక్ తెచ్చుకున్న 'భీమ్లా నాయక్' భారీ వసూళ్లను రాబడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa