ఏపీ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త అందించనుంది. జగనన్న తోడు పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.ఇందులో భాగంగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కానుంది. చిరు వ్యాపారులకు మేలు చేసేందుకు ప్రభుత్వం వడ్డీలేని రుణాలను అందజేస్తోంది.పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10వేలు ప్రభుత్వం అందజేస్తుంది. మొత్తం 5.10 లక్షల మంది చిన్న వ్యాపారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. వారికి రూ. 510 కోట్ల వడ్డీలేని రుణాన్ని ప్రభుత్వం అందజేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa