సినీ రంగంలో తనకంటు ప్రత్యేక స్థానాన్ని విజయ్ దేవరకొండ సొంతం చేసుకొన్నారు. దీంతో ఆయనకు వివిధ రంగాలలోనూ ఎనలేని ఆదరణ లభిస్తోంది. ఇదిలావుంటే గత కొన్నిరోజులుగా క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన ప్రైమ్ వాలీబాల్ లీగ్-2022 ముగిసింది. కోల్ కతా థండర్ బోల్ట్స్ విజేతగా అవతరించింది. ఇవాళ హైదరాబాదులో జరిగిన ఫైనల్లో కోల్ కతా థండర్ బోల్ట్స్ 15-13, 15-10, 15-12తో అహ్మదాబాద్ డిఫెండర్స్ ను ఓడించింది. ఇదిలావుంటే టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. డిఫరెంట్ గెటప్ తో వచ్చిన విజయ్ దేవరకొండ అందరినీ ఆకర్షించారు. విజయ్ దేదరకొండ ఈ కార్యక్రమానికి తల్లి, సోదరుడు ఆనంద్ లతో కలిసి విచ్చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa