ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వినూత్న ఆలోచన.. లారీలో రెస్టారెంట్!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 06, 2022, 03:03 PM

సాఫ్ట్​వేర్​ జాబ్ చేస్తున్న ఇద్దరు మిత్రులు ఏదైనా కొత్తగా వ్యాపారం చేయాలనుకున్నారు. ఫుడ్​ ట్రక్​ ఐడియా వాళ్లకి నచ్చింది. అయితే ప్రస్తుతం మార్కెట్​లో చాలా ఫుడ్​ ట్రక్​లు ఉండటంతో కాస్త వినూత్నంగా ఆలోచించారు. ఒక పాత లారీ కొనుగోలు చేసి అందులో కదిలే హోటల్​ ఏర్పాటు చేశారు.
వివరాల్లోకి వెళితే.. ఏపీలోని కృష్ణ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన మిక్కిలినేని శివ, చిక్కేలా యశ్వంత్ 15 ఏళ్లుగా సాఫ్ట్​వేర్​ జాబ్ చేస్తున్నారు. వినూత్నంగా ఏదో చేయాలనే ఆలోచనతో కదిలే ఆహారశాలను ఏర్పాటు చేశారు. ఈ ఐడియాను అమలు చేయాటానికి 10 టైర్ల పాత లారీని కొనుగోలు చేశారు. సుమారు 35 లక్షల వరకు ఖర్చు చేసి అన్ని హంగులతో ఓ ఆధునికి మొబైల్​ హోటల్ ​ను ఏర్పాటు చేశారు. కింది భాగంలో అన్ని సౌకర్యాలున్న వంటశాల పైభాగంలో 24 మంది కస్టమర్లు కూర్చొని తినేందుకు వీలుగా సీటింగ్​ ఏర్పాటు చేేశారు. కస్టమర్ల ఆర్డర్​ రెడీ కాగానే కిచెన్​ నుంచి నేరుగా పైకి వచ్చేలా లిఫ్ట్​ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో పాటు టీవీలను కూడా అమర్చారు. ఈ ఆధునిక మొబైల్ హోటల్​ను "మాన్​స్టార్​ ఫుడ్​ ట్రక్​" పేరుతో సూర్యాపేట జిల్లా కోదాడ మండలం చిమిర్యాల క్రాస్ రోడ్డు వద్ద 2 రోజుల క్రితం ఏర్పాటు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa