అవహేళన ఓ జవాన్ ను అవమానంగా భావించేలా చేసింది. దీంతో అతడు కాల్పులు జరపగా తొటి జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్‌లోని అమృత్ సర్‌లోని బీఎస్ఎఫ్ సిబ్బంది శిబిరంలో ఈ కలకలం చెలరేగింది. ఓ బీఎస్ఎఫ్ జవాను కాల్పులకు పాల్పడి ఐదుగురు జవాన్ల ప్రాణాలు తీశాడు. తనను తోటి జవాన్లు అవహేళనకు గురి చేయడంతోనే ఆ జవాను ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది. ఈ కాల్పుల ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటనలో మరో జవానుకు కూడా గాయాలు కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa