నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు ఎంతో అభివృద్ధి జరుగుతున్నాయని, బోధనా తీరులో కూడా మార్పులు వచ్చాయని దీనిని దృష్టిలో పెట్టుకొని పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని జెడ్పీటీసీ అనూష పేర్కొన్నారు. చిలమత్తూరు మండల కేంద్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా పరిషత్ పాఠశాలలో నాడు నేడు పథకం ద్వారా అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడ ముతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించడం జరుగుతోందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. ఉత్తమ ప్రతిభ గల అధ్యాపకుల బోధన పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం ఈ పాఠశాలకు నాడు నేడు పథకం ద్వారా ఏకంగా రూ. 96 లక్షల నిధులను మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు.
కార్యక్రమంలో ఎంపీడీఓ సుధామణి మాట్లాడుతూ నాడు నేడు పనులను నాణ్యతతో, తొందరగా పూర్తి చేయాలన్నారు. ఎంఈఓ నాగరాజు నాయక్, పాఠశాల హెచ్ఎం జయప్రద మాట్లాడుతూ పాఠశాలను విద్యా పరంగా ముందుకు తీసుకెళుతున్నామని, అయితే ప్రభుత్వ దానిని గుర్తించి వసతుల ఏర్పాటుకు నాడు నేడు పథకం కింద రూ. 96 లక్షలు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ముందుగా పాఠశాలలో శ్రీపొట్టి శ్రీరాముల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన చి త్రపటానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటి చైర్మన్ లక్ష్మినారాయణరెడ్డి, ఉ పాధ్యాయులు ఉన్నారు.