అనంతపురం జిల్లా కూడేరు మండలం ముద్దాలపురం గ్రామానికి చెందిన రాజ్ కుమార్ (30) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాలు రాజ్ కుమార్ కౌలుకు పొలాలు తీసుకుని పంటలు పండించే వారని, వ్యవసాయంలోనూ, మిరపకాయల వ్యాపారంలోనూ రూ. 5 లక్షలకు పైగా నష్టపోయినట్లు బాధిత కుటుంబీకులు తెలిపారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్థాపానికి గురై అర్దరాత్రి విషపు గుళికలు మింగడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.