బాల్య వివాహాలను నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీడీవో కమలాబాయి తెలిపారు. మండల కేంద్రం పెద్దపప్పూరులోని మండల పరిషత్తు కార్యా లయంలో బుధవారం బాల్య వివాహాల నిర్మూలనపై అవగా హన కల్పించారు. తల్లిదండ్రులు బాల్య వివాహాలు చేయ కుండా బాలికలను చదివించాలని అన్నారు. బాల్య వివాహా లతో అనర్థాలపై అవగాహన కల్పించారు. వాటికి సహకరిం చినా, ప్రోత్సహించినా నేరమన్నారు. ప్రధానోపాధ్యాయుడు ఆదినారాయణరెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ దస్తగిరమ్మ, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.