ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక గుట్టలను సీజ్‌ చెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 06, 2025, 01:38 PM

కొత్తపేట నియోజకవర్గ వ్యాప్తంగా అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక గుట్టలను సత్వరమే సీజ్‌ చే­యా­లని జగ్గిరెడ్డి డిమాండ్‌ చేశారు. మైన్స్‌ అధికారులు మొక్కుబడిగా వచ్చి వెళ్లిపోయారే తప్ప ఇసుక దొంగలను గుర్తించడంలేదన్నారు. ఇసుక గుట్టలను సీజ్‌చేసి అక్రమ తవ్వకాలను నియంత్రించకుంటే అధికారులను దోషులుగా గుర్తించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉచిత ఇసుక విధానంలో ట్రాక్టర్‌ ఇసుకకు రూ.300 వసూలు­చేయాల్సి ఉండ­గా కూటమి నేతలు రూ.600 వసూలు చేస్తున్నార­న్నారు.


ఇసుక ర్యాంపుల నుంచి కూటమి నేతల ద్వారా ప్రతినెలా మామూళ్ల కింద సుమారు రూ.రెండుకోట్ల వరకూ ఎమ్మెల్యే బండారుకు అందుతున్నాయని ఆరోపించారు. అలాగే, కూటమి నేతలు రాత్రి వేళల్లో లారీల్లో నింపి బయటకు తరలించి రూ.లక్షల్లో అవినీతికి పాల్పడుతున్నా­రన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నామ­మాత్రపు ధరకు ఇసుకను సరఫరా చేసిందని ఆయన గుర్తుచేశారు. స్థానిక ఏటిగట్టు పక్కన నిల్వ ఉంచిన ఇసుక గుట్టల పైనుంచి జగ్గిరెడ్డి సెల్ఫీ దిగి.. దమ్ముంటే ఇసుకాసురులపై చర్యలు తీసుకో­వాలని సీఎం చంద్రబాబుకు చాలెంజ్‌ విసిరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com